
ఘనంగా మున్నూరు కాపు సంఘం ఆత్మీయ చైతన్య సదస్సు
ఆసిఫాబాద్ పట్టణ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఆసిఫాబాద్, మే 27:
జిల్లా కేంద్రంలోని స్థానిక రోజ్ గార్డెన్‌లో మున్నూరు కాపు సంఘం పట్టణ ఆత్మీయ చైతన్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల జక్కయ్య, ప్రధాన కార్యదర్శి మిట్ట దేవేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సదస్సు సందర్భంగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా డేగల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా వొరగంటి సంతోష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పుట్ట వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా తుపాకుల సాయి ఎన్నికయ్యారు.
కోశాధికారులుగా గోనె వినేష్, కవల మహేందర్, ముఖ్య సలహాదారుడిగా అనిశెట్టి సదాశివ్, కార్యదర్శులుగా డి. నరేందర్, నరాల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. గౌరవ అధ్యక్షులుగా బండారి విశ్వనాథం, గడ్డల వెంకటేశం, సైదం రవీందర్‌లను ఎంపిక చేయగా, సలహాదారులుగా తాటిపెల్లి సుభాష్, జాపతి రమేష్, బోరిగాం సీతారాం, రేగుల బాలేష్‌లను నియమించారు.
గౌరవ మహిళా అధ్యక్షులుగా గుర్రాల హరిప్రియ, కొండు భారతి ఎన్నికయ్యారు. అదేవిధంగా వివిధ వార్డులకు సంబంధించిన కార్యవర్గ సభ్యులను కూడా ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ సమాజ ఐక్యత, యువత అభివృద్ధి, మున్నూరు కాపు సంఘ బలోపేతం కోసం సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యువ నాయకులు, మహిళలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.