సుభాష్ చంద్రబోస్ 127 వ జయంతి వేడుకలు
- సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ ఆదేశాల మేరకు
- సుభాష్ నగర్ లో గల సుభాష్ సుభాష్ చంద్ర బోస్ గారి విగ్రహానికి

నిజామాబాద్, జనవరి 23 ( లోకంతీరు ) : సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయకుమార్ గారి ఆదేశాల మేరకు నేషనల్ సెక్రటరీ మామిడాల మనోహర్ సూచన మేరకు సౌత్ ఇండియా వర్కింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ గంప హనుమా గౌడ్ సూచనలు మేరకు నిజామబాద్ సిటీ వర్కింగ్ కమిటీ చైర్మన్ నాలం రామా గౌడ్ గారి అధ్యక్షతన సుభాష్ చంద్రబోస్ 127 వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమము నిజామబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ లో గల సుభాష్ సుభాష్ చంద్ర బోస్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి జయంతి వేడుకలు జరపడం జరిగినది మరియు ఈ విగ్రహం సుభాష్ నగర్ లో ఎవరికీ తెలియని ప్రాంతంలో ఉండడం వలన ఈ విషయమై వెంటనే పక్కన గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గారు ఉన్నాడని తెలుసుకొని వారిని కలవడం జరిగినది మనం భారతీయ స్వాతంత్ర సంగ్రామ ముఖ్య నేతలలో ఒకడైన సుభాష్ చంద్రబోస్ విగ్రహం నిజామబాద్ పట్టణంలో సరైన స్థలంలో లేదని మరియు సుభాష్ నగర్ పేరు గల వీధిలో విగ్రహం లేనందున అక్కడ ముఖ్యమైన చౌరస్తాలో ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తాను కోరడమైనది దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినారు.
ఈ కార్యక్రమంలో నిజామా బాద్ పట్టణ అర్బన్ చైర్మన్ ఎం హరీష్ గౌడ్ మరియు వైస్ చైర్మన్ నాగరాజు, తీగల శ్రీనివాస్, స్వామి యాదవ్ కిషన్ గౌడ్ పాల్గొనడం జరిగినది.