Take a fresh look at your lifestyle.

బీసీ ల హక్కుల కోసం పోరాటం చేద్దాం…..

0 252

బీసీ ల హక్కుల కోసం పోరాటం చేద్దాం.

 

     

నిజామాబాద్ ,జనవరి 24  ( లోకంతీరు న్యూస్ ): బీసీలు ఐక్యంగా ఉండి, బీసీ ల హక్కుల కోసం పోరాటం చేద్దామని బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సుభాష్ నగర్ లోని ప్రైవేట్ విద్యా సంస్థలో పలువురికి జిల్లా సెక్రెటరీ గా కస్తూరి కృష్ణ, నగర వైస్ ప్రెసిడెంట్ గా ఎస్.భాస్కర్, మహిళల విభాగంలో మహిళ విభాగం జిల్లా సెక్రెటరీగా ఎన్.లావణ్య, ఈసీ లుగా రాజ సులోచన, సుమలత లకు జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజు, ఉద్యోగుల విభాగం రాష్ట్ర నాయకులు రేవంత్, రాష్ట్ర కార్యదర్శి సుజిత్ ఠాకూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.మురళి, జిల్లా ఉపాధ్యక్షులు శ్యాం, జిల్లా మహిళ అధ్యక్షురాలు ఏం. స్వప్న, నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘం జిల్లా జెఎసి అధ్యక్షుడు బొబ్బిలి నర్సయ్య హాజరై ఆయన మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి, బీసీ ల హక్కుల కోసం పోరాటం చేద్దామని, రానున్న రోజుల్లో బీసీల రాజ్యాధికార పోరాటానికి సిద్ధంగా ఉందామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి యం.శివ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బురుగుల వినోద్, జిల్లా విద్యా విభాగం కార్యదర్శి చైతన్య కృష్ణ, అమంద్ ప్రవీణ్ కుమార్, స్వామి యాదవ్, అహ్మద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.