Take a fresh look at your lifestyle.

కుష్ఠు వ్యాధిని నిర్మూలిద్దాం..ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్

0 1,829

కుష్ఠు వ్యాధిని నిర్మూలిద్దాం, పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.

  • ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్.
  • ఫిబ్రవరి 12 తేదీన పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 2 ( లోకం తీరు ) : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఉమ్మడి కోటగిరి మండలంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో జాతీయ కుష్ఠు నివారణ కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతినీ జనవరి 30 న పురస్కరించు కొని ఫిబ్రవరి 13 వరకు పక్షం రోజులలో అన్ని గ్రామాలలో కుష్ఠు నిర్మూలన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థుల చేత కుష్ఠు నివారణ,జాగ్రత్త లపై ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్ ప్రతిజ్ఞ చేపించారు. మొదటగా ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్ ఆధ్వర్యంలో కోటగిరి వైద్య సిబ్బందితో కలసి కేజీబీవీ పాఠశాల విద్యార్థులను ఆరోగ్య పరీక్షలు చేసి పలు రకాల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులకు అక్కడే మైనర్ ట్రీట్మెంట్ అందజేశారు.ఎవరికైన ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే కోటగిరి ప్రభుత్వ ఆసు పత్రికి తీసుకొని వెళ్లాలని కేజీబీవీ ఆరోగ్య సిబ్బందికి తెలిపారు.అంతేకాకుండా విద్యార్థులకు వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని, చేతులు నిరంతరం పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.అలాగే ఈ నెల 12 తేదీన విద్యార్థులందరు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకో వాలని ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్ సూచించారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ సవిత రాణి,సూపర్ వైసర్ జ్యోతి,సంగీత, ఉపాధ్యాయులు,కేజీబీవీ ఏఎన్ఎం అనుప,స్థానిక ఆరోగ్య కార్యకర్త శ్రీ దేవి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.