మహారాష్ట్ర ఆర్యవైశ్య 3వ మహాసభ
- ముఖ్యఅతిధిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

నిజామాబాద్, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ) : మహారాష్ట్ర పండరిపూర్ ఎస్ కన్వెన్షన్ లొ ఏర్పాటు చేసిన 3వ ఆర్యవైశ్య మహాసభ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర అటవీ & సాంసృతిక శాఖ మాత్యులు సుధీర్ బౌ ముంగంటివార్ మరియు ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొనడం జరిగింది, మొదటగా ముఖ్యఅతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు,అనంతరం ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతు ఆర్యవైశ్యలు అంటేనే సేవకు మారు పేరని, హిందూధర్మాన్ని రక్షించడంలో, సమాజంలో తమవంతు సేవ చేస్తూ ఉంటారని,రాజకీయంగా మనం కొంత వెనకపడుతున్నాం అని మనలో ఉన్న మేధావులు, యువత రాజకీయల్లోకి రావాలన్నారు,అందుకు ఆర్యవైశ్యలు అందరు ఒకటి కావాలన్నారు, ప్రజలు నిస్వార్ధంగా సేవ చేసే నాయకులు కావాలని కోరుకుంటున్నారని తెలిపారు, నేను ఇందూర్ లొ గెలవడానికి అక్కడ కాషాయాజెండా ఎగురావేయడానికి ప్రధాన కారణం నిరంతరంగా ప్రజలకు మా తల్లి & తండ్రుల పేర్లతో చేస్తున్న సేవ కార్యక్రమాలే అని అన్నారు, స్వతంత్ర వచ్చి ఇన్ని ఏళ్ళు గడుస్తున్న అగ్రవర్నంలో ఉన్న పేదల గురించి ఎవరు ఆలోచించలేదని, కానీ అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్ళని అర్ధం చేసుకొని బిజెపి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ EWS రిజర్వేషన్ కల్పించడం జరిగిందని అన్నారు, ఆర్యవైశ్య అభివృద్ధి కోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుండి సహాయ &సహకారం ఉంటుందని అన్నారు, వైశ్యలలో ఎక్కువమంది వ్యాపారస్తులు ఉంటారని అయితే అంబానీ ఫ్యామిలీ ఆదర్శంగా తీసుకోవడంతో పాటు, ఈ దేశం కోసం తమ ప్రాణాలు లెక్కచేయకుండా పని చేసిన మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, లాల లాజపతి రాయి లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని మనం కూడా చరిత్ర పూటలలొ నిలిచిపోయే విదంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లొ, శ్రీ. సమీర్ భావు కునావర్ ఎమ్మెల్యే, హింగన్‌ఘాట్ నియోజకవర్గం,
గుబ్బా చంద్ర శేఖర్‌జీ చైర్మన్- ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ బోర్డు, సంపద,
బచ్చు విలాస్ గుప్తాజీ తాత్కాలిక కమిటీ సభ్యుడు శ్రీ కాశీ అన్నసత్రం,
నంద కుమార్ దత్తాత్రయ గదేవార్
మహారాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు, మరియు నిజామాబాద్ బీజేపీ జిల్లా ఉపా అధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.