వెలుగు విలువ తెలియాలంటే చీకటి అనుభవం తెలియాలి.
- 2028లో ప్రజలు బ్రహ్మండమైన మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు పోచారం శ్రీనివాస రెడ్డి.
- స్పీకర్ గెలవరనే చరిత్రను అందరి సహకారంతో తిరగరాశాం.పోచారం భాస్కర్ రెడ్డి.
- పార్టీ తరుపున ఎంపీ అభ్యర్థిగా పోచారం భాస్కర్ రెడ్డి నిలబడితే భారీ మెజారిటీతో గెలిపించుకోవా లి. పోచారం సురేందర్ రెడ్డి

బాన్సువాడ కోటగిరి , ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : -కెసిఅర్ వెలుగు పరిపాలన విలువ తెలియాలంటే కాంగ్రెస్ చీకటి పాలన తెలియాలని మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి,బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.బుధ వారం బాన్సువాడ పట్టణం,కొల్లూరు రోడ్డులోని ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్య కర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వ హించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచ్,ఉప సర్పంచ్ల పదవి విరమణ సందర్భంగా వారిరువురినీ ఆయన ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పోలై న ఓట్లలో కేవలం1.8 శాతం తక్కువ తేడాతో రాష్ట్రంలో అధికారం కోల్పోయాం.కాంగ్రెస్ పార్టీకి 92 లక్షల ఓట్లు వస్తే,బీఆర్ఎస్ పార్టీకి 87 లక్షలు ఓట్లు వచ్చాయి.14 స్థానాలలో స్వల్ప మెజారిటీ తో ఓడిపోయాం.20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యే లను మారిస్తే సరిపోయేది.రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం మనది కాకపోయినా,నేను బాన్సువాడ ప్రజలు ఎన్నుకున్న స్థానిక శాసనసభ్యుడిని అన్నారు.కష్టపడి గెలిపించిన నాయకులకు,కార్యకర్తలు, ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకుడు సిగ్గు లేకుండా బాన్సువాడ నియోజకవర్గంలో తిరుగు తున్నాడు.ఆయన ఎమ్మెల్యేగా మూడు సార్లు ఉండి స్వంత ఊరిలో పేదలకు ఒక్క ఇల్లు కట్ట లేదు.ఆయన స్వంత ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ స్కూల్ భవనం పడిపోతున్నా నిర్మించ లేదు.అధికారంలో ఉన్నప్పుడు నేను ఎవ్వరిపై వ్యక్తిగతంగా కక్ష సాదించలేదు.మా మండల, గ్రామాల నాయకులకు కూడా అలా చేయమని చెప్పలేదు.నేను కక్ష సాదిస్తే ఎవ్వరు మిగిలే వారు కాదు.నేను అలాంటి వాడిని కాదు.నా మనస్సు అలాంటిది కాదురాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి హుందాతనం ఉండాలి.మేము కూడా 39 మంది శాసనసభ్యులం ఉన్నాం.ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రూ.2 లక్షల రుణ మాఫీ చేయం డి.రైతుబంధు రూ.15,000 ఇస్తామన్నారు ఇంత వరకు పాత ప్రకారం కూడా రాలేదు.
జహీరా బాద్ ఎంపీ అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయి స్తారు.జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గెలుపును బాన్సువాడ నియోజక వర్గమే నిర్ణయిస్తుంది. నిజాంసాగర్ నీటి విడుదల విడతల వారిగా జరుగుతుంది.ఎకరం కూడా ఎండి పోకుండా నీటిని విడుదల చేస్తాం.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన తిరిగి మిమ్మల్ని సర్పంచ్ లుగా గెలిపిస్తాను.ప్రతి గ్రామంలో చేసిన అభివృద్ధి ని ప్రజలకు అందరికీ చెప్పి ఓట్లు అడుగు తాను. మీ కృషితో నేను ఎమ్మెల్యేగా గెలిచాను.ఇప్పుడు కష్టపడి మిమ్మల్ని అందరినీ సర్పంచ్ లుగా గెలిపి స్తాను.బాన్సువాడ నియోజక వర్గం అభివృద్ధిలో నిండు కుండలా ఉన్నది.నియోజక వర్గ ప్రజలకు రోజు అందుబాటులో ఉండి మీ కష్ట సుఖాలలో తోడుగా ఉంటాననీ అన్నారు. పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ… పోచారం ఓడిపోతారని బెట్టింగ్ లు కట్టారు.కానీ దేవుడి ఆశిర్వాదం,మీ కష్టంతో విజయం సాదిం చాం.పోచారం శ్రీనివాస రెడ్డిని గెలిపించిన మీ అందరికీ పేరుపేరునా పాదాభివందనాలు తెలియ జేశారు.23,464 ఓట్ల మెజారిటీ వచ్చింది.ఇది మామూలు విషయం కాదు.ఇందులో మీ కృషి ఉన్నది.మా నాయకులు,కార్యకర్తల జోలికి ఎవరై నా వస్తే వీపులు పలుగుతాయి.పోచారం శ్రీనివాస రెడ్డి 2004 నుండి 2014 వరకు అధికారంలో లేరు. మనకు ప్రతిపక్షం కొత్తకాదు.అందరూ దైర్యంగా ఉండండి.మీకు ఎల్లవేళలా నేను అండగా ఉంటా ననీ.తెలంగాణ తెచ్చి,పది సం.లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ ని రేవంత్ రెడ్డి రండ అనడం కరక్ట్ కాదన్నారు.ఏ ఎన్నికలలో అయినా స్థానికుడి నే బాన్సువాడ ప్రజలు గెలిపిస్తారనీ తెలిపారు.పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ…
బాన్సువాడ నియోజకవర్గంలో గత పది సం.లాలో అభివృద్ధి సంక్షేమం జరిగిందని.జహిరాబాద్ ఎంపీ అభ్యర్థి విజయం బాన్సువాడ నియోజకవర్గం నిర్ణయిస్తుందన్నారు.ఎంపీ అభ్యర్థిగా భాస్కర్ రెడ్డి నిలబడితే మనమందరం కష్టపడి భారీ మెజారిటీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు.ఈ కార్యక్ర మంలో నిజామాబాద్ జిల్లా డిసిసి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి,జిల్లా రైతుబంధు అధ్యక్షుడు డి.అంజి రెడ్డి,జిల్లా బంజారా సేవా సమితి అధ్యక్షులు బద్యా నాయక్,బాన్సువాడ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ మండల కన్వినర్లు,ఆయా గ్రామాల బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.