Take a fresh look at your lifestyle.

సీనియర్ జర్నలిస్టుకు ఘన నివాళులు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు…

0 1,589

సీనియర్ జర్నలిస్టుకు ఘన నివాళులు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు.

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 09 ( లోకం తీరు ) : సీనియర్ జర్నలిస్ట్ హంగర్గ గంగాధర్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని కోటగిరి మండల ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ఆయన స్వగృహంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గంగాధర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ముందుగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రెస్ క్లబ్ పాత్రికే యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంత రం గంగాధర్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా హంగర్గ గంగాధర్ కుటుంబ సభ్యులకు జర్నలిస్టు లు మనోదైర్యని కల్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గోగినేని హనుమంతరావు మాట్లాడుతూ.కోటగిరి మండలంలో జర్నలిజానికి మరో పేరుగాంచిన క్రీస్తు శేషులు హంగర్గ గంగాధరని అన్నారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుని వేడు కుంటున్నామన్నారు. సమాజంలో పాత్రికేయులు ఎలా ఉండాలి,ఏ విధంగా నడుచుకోవాలని,సమాజ సంక్షేమంలో ఎలా పాటుపడాలి అని తెలియజేసిన ప్రథముడు హంగర్గ గంగాధరని అని కొనియాడారు.మేమంతా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సమాజానికి ఇతోధికంగా కృషి చేస్తామన్నారు.వారి కుటుంబ సభ్యులకు సైతం మా ప్రెస్ క్లబ్ అండదండలు ఉంటామని ఆయన్నారు.ఈ కార్యక్రమంలో పోరు న్యూస్ రిపోర్టర్ బి రాములు,దిశ రిపోర్టర్ కాసుల శ్రీకాంత్,ఆంధ్రప్రభ రిపోర్టర్ పెంటయ్య,భారతి ఛానల్ రిపోర్టర్ సాయిబాబా గౌడ్,మన న్యూస్ రిపోర్టర్ పుప్పాల సైదయ్య,తెలుగు ప్రభ రిపోర్టర్ సాయిలు,మీడియా టుడే రిపోర్టర్ ఎన్నవార్ రాజు,జనశక్తి రిపోర్టర్ జి.రాజు,చట్టం రిపోర్టర్ ఇందుర్ గంగాధర్,ఆజ్ కా తెలంగాణ రిపోర్టర్ హైమద్,సిటీ డిజిటల్ లోకల్ న్యూస్ రిపోర్టర్ రాము తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.