ఓరుగల్లు ముద్దు బిడ్డ PV కి భారత రత్న
– హర్షం వ్యక్తం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

నిజామాబాద్, ఫిబ్రవరి 09 ( లోకం తీరు ) : ఓరుగల్లు జిల్లా నర్సంపేట, లక్నెపల్లి గ్రామంలో లొ రుక్మబాయ్ & సీతారామరావు దంపతులకు మారుమూల గ్రామంలో జన్మించి రాజకీయంగా అంచేలాంచెలుగా ఎదిగి రాష్ట్ర శాఖలో వివిధ మంత్రిపదవులు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి కేంద్ర రాజకీయాలలో కూడా కీలక పాత్ర పోషించి దేశప్రధానిగా కూడా సేవలాందించి తెలంగాణ, తెలుగోడి గొప్పతనాన్ని వెలుగేత్తి చాటిన వ్యక్తి, దారి తప్పిన ఆర్ధిక వ్యవస్థను పునరుద్దించిన వ్యక్తి పీవీ నర్సింహారావు అని,రాజకీయంగానే కాకుండా కళ &సాహిత్యంలొ కూడా మంచి పట్టు ఉన్న వ్యక్తి వేయి పడగాలు అనే నవలను హిందీలో అనువాదించినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత P V నర్సింహారావు అని, అతనికి భారతరత్న రావడం చాలా సంతోషం అని పీవీ చేసిన సేవలు గుర్తించి భారత రత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కి ధన్యవాదములు తెలియజేసారు.