Take a fresh look at your lifestyle.

బ్యాంకులు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

0 1,285

బ్యాంకులు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 14 ( లోకంతీరు ) : బ్యాంకులో అందించే సేవింగ్ పథకాలను, రుణ పథకాలను, బీమా పథకాలను, సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ భార్గవ సుధీర్
అన్నారు.ప్రజలలో డిజిటల్ లావాదేవీలపై అవగాహన కలిగించి ఆర్ధిక అక్షరాస్యతను పెంపొందించుకు మండల కేంద్రాలలో ఆర్ధిక అక్షరాస్యత కేంద్రాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. గత రాత్రి సదాశివనగర్ మండల కేంద్రంలో ర్లపాటు చేసిన ఆర్ధిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను వివిధ మండలాల్లో స్థాపిస్తున్నామన్నారు. ఈ కేంద్రాలు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు కెనరా బ్యాంకు ఇదివరకే జిల్లాలో 3 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను స్పాన్సర్ చేసిందని ప్రస్తుతం సదాశివనగర్ తో పాటు బాన్సువాడ, బిచ్కుంద మండల కేంద్రంలో కేంద్రాలు ప్రాఏరంబిస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ అర్థిక అక్షరాస్యత పెంపొందించుకొని రిజర్వ్ బ్యాంక్ గుర్తించిన ఆర్థిక సంస్థల ద్వారా ఆర్థిక వ్యవహారాలు చేయాలని ,ఆర్థిక సంస్థలలో ఆర్థిక మోసాలు జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంబేడ్కస్మన్ ద్వారా పరిష్కారం పొందవచ్చని సూచించారు. .
ఈ కార్యక్రమంలో కామారెడ్డి కెనర బ్యాంక్ మేనేజర్ కే. రవి కుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ భువనేశ్వర్ , డిస్ట్రక్ కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ జయశ్రీ, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి ఆంజనేయులు,ప్రాజెక్ట్ మేనేజర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.