రేపటి నుండే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 27 ( లోకంతీరు ) : రేపటి నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రం అన్ని ఏర్పాట్లతో సిద్ధమైంది. ఇంటర్ ప్రథమ సం.జనరల్లో 208 మంది,వోకేషన్లో 44 మంది విద్యార్థులు అలాగే ద్వితీయ సం.జనరల్లో 179 మంది,వోకేషన్లో 45 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని పరీక్ష కేంద్ర సిఎస్ రిజ్వానా సమ్రీన్,డివో రవీందర్ తెలిపారు.విద్యార్థులు అర గంట ముందుగా పరీక్ష కేంద్రాని కి చేరుకోవాలని వారు సూచిం చారు.ఎవరైనా పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చినట్లయితే వారికి లోనికి అనుమ తించబోమని అన్నారు.