రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లకు సన్మానం
• కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం ధైర్యంగా ఉండండి
• బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

భీంగల్ ప్రతినిధి, జులై 19 ( లోకంతీరు ) : రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లుగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాయకులకు శుక్రవారం నాడు భీంగల్ పట్టణంలోని సహస్ర పంక్షన్ హాల్ లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమింపబడిన ఈరవత్రి అనిల్ కు,తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమింపబడిన మానాల మోహన్ రెడ్డికి,వితనాభివృద్ధి చైర్మన్ అన్వేష్ రెడ్డికి,ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందాన్ కు సన్మాన కార్యక్రమంను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకే విద్య వైద్య వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేస్తూ కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని,ప్రజలు సొంత భూమిపై లోన్ తీసుకోకుండా ధరణితో మోసం చేశారాణి, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు మేలు చేసే విధంగా రుణమాఫి చేస్తున్నారని, మాట ఇఛ్చిన విధంగా ధరణి వాళ్ళ కాకుండా ప్రజల భూములు ప్రజలకు చెందాలని అధికారుల వద్ద సమస్యలు పరిష్కరించే విధంగా రేవంత్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేశారాణి ఆయన అన్నారు. కెసిఆర్ పది సాంవత్సరాలలో లక్షల రూపాయలు లోన్లు తీసుకువచ్చి అన్ని వ్యవస్థలను నాశనం చేసారని, రేవంత్ రెడ్డి ఇచ్చిభ మాట ప్రకారంగా జిల్లాలో 44,600 కుటుంవాలకు లక్ష లోపు రుణమాఫి చేశారాని, అదేవిధంగా ఆగష్టు 15 వరకు 2 లక్షల రుణమాఫి చేస్తామని తెలిపారు.రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రైతులు ధైర్యంగా ఉండాలని,అదేవిదంగా విద్య రంగంలో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విదగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు.,పార్టీ కోసం పనిచేసిన వారికీ గుర్తింపు ఉంటుందని, వారికి పదవులు దక్కే విదంగా చూస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేసి దేశాన్ని అభివృద్ధి చేస్తే బీజేపీ దేశాన్ని అడుగునకు తొక్కేస్తునానరు. ప్రతి దానిపై GST వేసి మనకు చేసిన అభివృద్ధి ఏమి లేదు. సోనియా గాంధీ కుటుంబం 20 సంవత్సరాలుగా ప్రధానిగా వుండి సొంత ఇల్లులేదని కానీ మోడీ పది సంవత్సరాలలో ఎంతో సంపాదించడాని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి మూడు రాష్ట్ర పదవులు వఛ్చినందుకు అన్ని స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని, అందరు బాధ్యతతో కలిసి పని చేయాలనీ ఆయన అన్నారు.
ఈ సందర్బంగా ఖనీజాభివృద్ధి చైర్మన్ ఈరావత్రి అనిల్ మాట్లాడుతూ ఈ పది సంవత్సరాలు అధికారంలో లేకున్నా కార్యకర్తలు పడ్డ కష్టాలను మేము చూశామని, పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అందదండగ ఉండి,ఎన్నో అవకాశాలు వఛ్చిన పార్టీ వదలని నేత సుదర్శన్ రెడ్డి అని,పది సంవత్సరాలుగా BRS ఎన్ని కష్టాలు పెట్టిన భయపడకుండా కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడ్డారని అన్నారూ.ఎప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలను వదిలి పెట్టమని, కార్యకర్తల ఋణం తీర్చుకుంటానని అన్నారు.కానీ తెరాస నాయకులకు ఏవిధంగా ప్రజల డబ్బును దోచుకుందామనే ఆలోచన ఉంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రం ప్రజలకు సేవ చేయాలనే ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫి చేసి రైతుల కళ్ళలో ఆనందం నింపారాని, ఈ రోజు మనం అందరం ప్రజల మధ్యలో తిరుగుతున్నాం అంటే అది రేవంత్ రెడ్డి వల్లనే అని ఆయన అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలిసిన సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నడని, కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు ఉండవని చేసే కృషి వల్లనే గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడానికే ఈ కార్యక్రమం జరుగుతుందని, కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందని హమీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ఎంతో అద్భుతమైన రోజు అని, ఈ రోజును ఎన్నటికీ మరువలేనిదని, సుదర్శన్ రెడ్డి వల్ల నా జీవితమే రాజకీయంగా మలుపు తిరిగిందని, నాకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చారని, నేను చేసిన ప్రతి పోరాటం లో అండదండగ వుండి సహకారం అందించారని అన్నారు.బాల్కొండ నియోజక వర్గ నాయకులు నాకు ఎంతో సంహరించారాని, నిజామాబాదు లో చేసిన ప్రతి పోరాటానికి బాల్కొండ నుండి అనేక మంది వచ్చి నా విజయంలో పలుపంచుకున్నారని,ప్రతి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏ పని చెప్పిన వంద శాతం పూర్తి చేసారని అన్నారు.గ్రామ గ్రామాన రైతు రుణమాఫి గురించి తెలపాలని మాణాల మోహన్ రెడ్డి అన్నారు.
తహేర్ బిన్ హందన్ మాట్లాడుతూ ఈ రోజు చేస్తున్న సన్మానం ప్రతి కార్యకర్తకు చెందుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట తప్పకుండ చెప్పిన విధంగా రైతు రుణమాఫి చేసారని, రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటారని తెలిపారు.
వితనాభివృద్ది చైర్మన్ అన్వేష్ మాట్లాడుతూ నాకు పదవి వచ్చింది అంటే ఆది కార్యకర్తల గొప్పతనమే అని, కిసాన్ కాంగ్రెస్ విభాగంలో రైతు సమస్యల పట్ల చేసిన పోరాటాలు చూసే కాంగ్రెస్ పార్టీ నాకు పదవి ఇచిందని, రైతు రుణమాఫి అనేది దేశ చరిత్రలోనే మరువలేనిదని, ఒకేసారి రెండు లక్షలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైందని కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత సంబురాలు చేయాలనీ అయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి,డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి,గొర్త రాజేందర్,నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు,భీమ్గల మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి,బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,మెండోర ముత్యం రెడ్డి,కమ్మర్పల్లి సుంకేత రవి,వేల్పూరు నర్సారెడ్డి,ఎర్గట్ల దేవరెడ్డి,మోర్తాడ్ రాములు, ముప్కల్ ముత్యం రెడ్డి,రుద్రంగి మండల కాంగ్రెస్ అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అడెం గంగా ప్రసాద్,రత్నాకర్,మర ఛంద్ర మోహన్,చంద్రు నాయక్, ఇట్టం జీవన్,కుంట రమేష్,జేజే నర్సయ్య,రంగు అనిల్ గౌడ్,మరియు అన్ని విభాగాల అధ్యక్షులు మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.