గ్రామ దేవతలకు ఘనంగా పూజలు

కామారెడ్డి జిల్లా, జూలై 26 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండల గొల్లపల్లి గ్రామం లో ఘనంగా గ్రామ ప్రజలు గ్రామ దేవతల పండుగ ను అన్ని వర్గాల కుల పెద్దలు గరుగుల్ గ్రామ బిటి రోడ్డు దగ్గర ఉన్న నాయకమ్మ దేవతలకు పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం లో అందరూ బాగుండాలని ఆయు అష్టశ్వర్య లతో సుఖ సంతోషాలతో ఆరోగ్య కరంగా గ్రామ ప్రజలు అందరు బాగుండాలని మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గరుగుల్ గ్రామ మాజీ సర్పంచ్ గుడి నిర్మాణ ప్రదాత మొగుళ్ల సాయగౌడ్, రామగౌడ్, గొల్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ లావణ్య మల్లేశ్, గ్రామ విడిసి చైర్మెన్ మర్రి అంజయ్య, గ్రామ పెద్దలు బీరయ్య, ఎల్లయ్య, సుమన్, మహేష్, వి డి సి కార్యదర్శి రెడ్డి మల్లేశ్, వి సాయిలు, కందురీ సాయిలు, జెపి మహేష్, గొల్ల మల్లయ్య, గొల్ల నవీన్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.