కమ్యూనిటీ వాలంటీర్లకు దిశా నిర్దేశం చేసిన హైకోర్టు న్యాయమూర్తులు
— జస్టిస్ సుజాయ్ పాల్
— జస్టిస్ జి శ్రీనివాస్ రావు
— స్వచ్ఛందంగా,సామాజిక బాధ్యతతో తగాదాల పరిష్కారానికి కృషి


కామారెడ్డి జిల్లా, జూలై 27 ( లోకంతీరు ) : పోలీస్ కార్యాలయంలో కమ్యూనిటీ వాలంటీర్లకు మధ్యవర్తిత్వ చట్టాల పై అవగాహన కల్పించడం జరిగినది.వివాహ వ్యవస్థ మరియు సామాజిక సమస్యల్లోని తగాదాలను పరిష్కరించవచని హై కోర్ట్ న్యాయ మూర్తి , తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్ పేర్కొన్నారు.శనివారం కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యం లో కమ్యూనిటీ వాలంటీర్ల తో సమావేశానికి ముఖ్య అతిధి గా హాజరయి మాట్లాడారు. రాష్ట్రం లో ప్రయోగాత్మకంగా కామారెడ్డి జిల్లా లో కమ్యూనిటీ వాలంటీర్ లను ఏర్పాటుచేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు అని తెలిపారు. గ్రామాలల్లో కొందరు ప్రజలు అవగాహనా లోపం తో ఆవేశాలకు గురై కోర్ట్ కేసుల వరకు వెళ్తున్నారు.
సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించునే సమస్య సైతం పంతాలకు పోయి పోలీస్ కేసులు వరకు వెళుతున్నారు . ఏళ్ల క్రితం గ్రామాలలో పెద్ద మనుషులే ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను అక్కడిక్కడే పరిష్కరించేవారు . సమస్యలను పరిష్కరించి కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లు రాష్ట్రంలో ఆదర్శవంతంగా పని చేయాలనీ అన్నారు. కేరళ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రలో ఇలాంటి మీడియేషన్ సెంటర్ ద్వారా ఎన్నో కేసులు పరిష్కరించారన్నారు .
అలాగే ఈ కార్యక్రమానికి గెస్ట్ అఫ్ హానర్ హై కోర్ట్ న్యాయమూర్తి , కామా రెడ్డి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, జస్టిస్ జే శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తెలంగాణ లో ఒక సామాజిక కార్యకర్త పెద్దమనుషుల సమక్షం లో తగాదా పరిష్కరించడానికి కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లు పనిచేయాలన్నారు.చిన్నసమస్యలవల్ల ఇరువర్గాల వారు ఏళ్ళ తరబడి గొడవలు పెంచుకుంటున్నారు. కుటంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బులను వృధా చేసుకుంటున్నారని తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ రాజీమార్గం ద్వారా సమస్యలను పరిష్కరించడం వల్ల సమాజంలో మంచి వాతావరణం ఏర్పడుతుందని ఇందుకోసం వాలంటరీల కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్ వాన్ సూచించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మంచి పేరు, రాజకీయ ప్రమేయం లేని, ఇలాంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేని వారిని గుర్తించి కమ్యూనిటీ వాలంటరీగా ఎంపిక చేశామని సామాజిక బాధ్యతతో చిన్నచిన్న తగాదాలను పరిష్కరించాలని, ఎలాంటి ప్రభావములకు గురి కావద్దని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్ సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబెర్ సెక్రటరీ పంచాక్షరీ, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి డాక్టర్.వరప్రసాద్,కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ సింధు శర్మ,అడిష నల్ జిల్లా న్యాయ మూర్తి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ , సీనియర్ సివిల్ జడ్జి, సెక్రటరీ టీ నాగరాణి , జూనియర్ సివిల్ జడ్జి కే. సుధాకర్ , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీక్ష ,జిల్లా న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్ వి. చంద్రసేన్ రెడ్డి,సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.