సైబర్ నేరాలకు మోసపోవద్దని బాల్కొండ ఎస్సై తెలిపారు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 07 ( లోకంతీరు) : బాల్కొండ గ్రామానికి చెందిన దేవపద్మారావుకు గత మే నెలలో తన టెలిగ్రామ్ అకౌంట్ నందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు యుమ్ రెసిపీస్ నందు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పగా దానిని అతను నమ్మి వారికి పలుమార్లు వారి అకౌంట్లోకి మొత్తం 67,715/- డబ్బులు పంపడం జరిగింది కానీ అతనికి ఎలాంటి లాభాలు రాకపోయేసరికి మోసపోయానని గ్రహించి పిఎస్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా ఎండి యాసిర్ అర్ఫాత్ ఎస్ఐ బాల్కొండ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కావున ఇలాంటి మెసేజ్లు గాని ఫోన్ కాల్స్ గాని వస్తే ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని అలాంటిది ఏమైనా వస్తే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసు వారు తెలిపారు . గుర్తుతెలియని సైబర్ నేరస్తులు ఏదో విధంగా ఆశ చూపి ప్రజలను ఇలా మోసం చేస్తున్నారు కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటివి నమ్మవద్దని పోలీసు తెలిపారు.