రాష్ట్రస్థాయి ఉత్తమ మండల సమాఖ్యగా కమ్మర్పల్లి..
– మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన ఏపిఎం, మండల సమాఖ్య అధ్యక్షురాలు

కమ్మర్పల్లి , ఆగస్టు 14 ( లోకంతీరు ) : హైదరాబాదులో జరిగిన స్త్రీనిధి 11వ వార్షిక సమావేశంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కు రాష్ట్రంలోనే ఉత్తమ మండల సమాఖ్య విభాగంలో మొదటి బహుమతి కి ఎంపికవగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా అవార్డు అందజేశారు. కమ్మర్పల్లి మండల ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రోజా రాణిలు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రశంసా పత్రం జ్ఞాపిక అందుకున్నారు.రాష్ట్రస్థాయిలో ఉన్న మొత్తం 594 మండలాలలో కమ్మర్పల్లి మండలం మొదటి స్థానంలో నిలిచింది.
కమ్మర్ పల్లి మండలంలో రుణాల పంపిణీ, రికవరీ, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల ఏర్పాటు వంటి అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించిన మండల సమాఖ్య కు ఈ అవార్డు పంపిణీ చేసినట్లు ఏపీఎం గంగాధర్ పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్, డిఆర్డిఏ ఉన్నత అధికారుల సలహాలు సూచనలతో పాటు
కమ్మర్పల్లి మండలంలోని ఆరుగురు సీసీలు రవికుమార్ శ్రీనివాస్ నవీన్ భాగ్యలక్ష్మి పీర్య అలేఖ్యలతో పాటు 29 వివోఏలు, కమ్మర్ పల్లి మండల సమాఖ్య సిబ్బంది అంతా కలిసి చేసిన సమిష్టి కృషి వల్లనే ఈ అవార్డు సాధ్యమైందని ఏపిఎం వివరించారు.కాగా రాష్ట్రంలో 33 జిల్లాల్లో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా జిల్లా డిఆర్డిఓ సాయ గౌడ్ ఇదే సమావేశంలో ముందుగా అవార్డు అందుకున్నట్లు గంగాధర్ వెల్లడించారు.
ఈ అవార్డు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్, సేర్ప్ సీఈవో దివ్య, స్త్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి ల సమక్షంలో అందజేసినట్లుగా వెల్లడించారు.