పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన కలెక్టర్
— ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : పల్లె ప్రకృతి వనం లో చెట్లు దట్టంగా పెరిగి అల్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి లోని పల్లె ప్రకృతి వనాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. ప్రకృతి వనం చుట్టూ నడకదారిలో వెళ్లి వనంలో ఉన్న చెట్లను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. పండ్లు, ఔషధ మొక్కలు పెంచాలని గ్రామస్తులకు సూచించారు. ప్రస్తుతం మొక్కలు నాటడం వల్ల భావితరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షణ చేయాలని చెప్పారు.