యువకుడు అదృశ్యం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 22 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి పాలెం గ్రామానికి చెందిన జాగురాంపల్లి జాయరాజ్ 36 వయస్సు, 10.08.2024 రోజున నిజామాబాద్ వెళ్తున్న అని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయి ఇంతవరకు రాలేడని తన కొడుకు గుర్తుపట్టుటకు తెలుపు రంగులో ఉండి ఎత్తు 5′, 9″వరకు ఉంటాడని,ఈ రోజు తండ్రి జాగురాంపల్లి వెంకన్న పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విక్రమ్ తెలిపారు,వ్యక్తి ఎక్కడన్నా ఎవరికైనా కనిపిస్తే 8712659867 నెంబర్ కు ఫోన్ చేయగలరని మోర్తాడ్ ఎస్సై తెలిపారు.