Take a fresh look at your lifestyle.

గణేష్ మండపాల నిర్వాహకులు తెలంగాణ రాష్ట్ర పోలీస్ పోర్టల్ లో ధరఖాస్తు చేసుకోవాలి….

0 1,132

గణేష్ మండపాల నిర్వాహకులు తెలంగాణ రాష్ట్ర పోలీస్ పోర్టల్ లో ధరఖాస్తు చేసుకోవాలి

– ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్.


ఎల్లారెడ్డి , ఆగస్టు 31 ( లోకంతీరు ) : వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ పోర్టల్ లో ధరఖాస్తు చేసుకోవాలని, వినాయక నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు కొరకే గణేష్ మండపాల ఆన్లైన్ నమోదు విధానం అందుబాటులోకి తేవడం జరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ పోర్టల్ లో ధరఖాస్తు చేసుకోవాలని, అప్లికేషన్ నమోదు చేసేందుకు
https://police portal kkl.tspolice.gov.in/index.హటం లింకును క్లిక్ చేయాలన్నారు. ఈ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం గణేష్ మండపాల నిర్వహణ, వాటికి సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే అని తెలిపారు. ఈ సమాచారం ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు. పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతిని మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.