Take a fresh look at your lifestyle.

రోజంతా జోరు వాన…….

0 1,318

రోజంతా జోరు వాన…!

– పొంగి పొర్లిన వాగులు, వంకలు, చెరువు
– ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు

ఎల్లారెడ్డి ,సెప్టెంబర్ 01( లోకంతీరు ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఎల్లారెడ్డి మండలంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాత్రి నుంచి రోజంతా భారీ వర్షాలు కురిసింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండడంతో అధికారులు,పోలీసు యంత్రాంగం అప్రమతమై ఇప్పటికప్పుడు సమస్యలను సమీక్షిస్తున్నారు. దీంతో ఎల్లారెడ్డి మండల పరిధిలోని తిమ్మారెడ్డి వైపు వెళ్లే కళ్యాణి కళ్యాణి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వాగును పరిశీలించి రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు. ప్రజలు వాహనదారు అటు వెళ్లకుండా రాకపోకులకు కంచే ఏర్పాటు చేశారు. రెండు వైపులా ప్రజలు వాగు దాటేందుకు ప్రయత్నం చేయొద్దని సూచించారు.తిమ్మారెడ్డి, వెల్లుట్ల, వెల్లుట్లపేట గ్రామాలకు వెళ్లేవాళ్లు అన్న సాగర్ గ్రామం మీదుగా వెళ్లాలని ప్రజలకు వాహనదారులకు కోరారు. అదేవిధంగా మండలంలోని హాజీపూర్ తండా సూరాయి చెరువు అలుగు పోర్లడంతో స్థానిక తహసిల్దార్ అల్లం మహేందర్, ఎంపీ ఓ ప్రకాష్ చెరువు అలుగును పరిశీలించారు. కట్టకింద ప్రజలు ఎవరు బయటికి రావద్దని, ఎవరైనా బంధువులు వచ్చినట్లయితే సమాచారం ఇవ్వాలని తాండవాసుల కోరుతూ అలుగు ఇరువైపులా కంచె ఏర్పాటు చేశారు. అనంతరం పట్టణంలోని లోతట్టు కాలనీలో వర్షపు నీటితో జలమాలమయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.