అకాల వర్షాలు కురుస్తున్న కారణంగా
రైతులు, ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దు
– ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : జిల్లాలోని లింగంపేట్ మండల కేంద్రంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగంపేట మండలంలో కురిసిన భారీ వర్షాలపై కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని, ఎప్పుడు రైతులకు సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఎప్పుడు అందుబాటులో అండగా ఉండే వ్యక్తి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అని ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు అన్నారు. అకాల వర్షాలు కురుస్తున్న సందర్భంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్న సందర్భంగా రైతులు పొలాల దగ్గరికి వెళ్లిన సందర్భంలో బోరు మోటారు, స్టార్టర్, విద్యుత్తు, ఫీజ్ వైర్ ఉన్నందున వాటిని జాగ్రత్తగా బోరు స్విచ్ వేసేటప్పుడు జాగ్రత్త వహించాలని రైతులను కోరుతున్నానన్నారు. వాగులు, వంకలు పొంగీ పొర్లుతున్న సందర్భంగా అక్కడ ఉన్న రైతులు కావచ్చు, గడ్డకు ఉన్న రైతులు కావచ్చు వాగును దాటే ప్రయత్నం చేయవద్దని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, రైతులకు లింగంపేట్ మండల ప్రజలకు రైతులకు ఎప్పుడు రైతుల బాగోగుల కోసం ఆలోచించే, పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అని రైతు సంక్షేమం కోసం తపించే పార్టీ ఇది రైతుల పార్టీ రైతులకు ఎప్పుడు వెన్నండి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎల్లారెడ్డి నియోజక వర్గ ప్రజలు, లింగంపేట్ మండల ప్రజలు ఎలాంటి దిగులు చెంద వద్దన్నారు. రైతులకు ఎలాంటి సమస్య వచ్చిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, రైతులకు లింగంపేట్ మండల రైతులకు గాని కాంగ్రెస్ పార్టీ తరుపున లింగంపేట మండలం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు , కాంగ్రెస్ పార్టీ లింగంపేట్ మండల సీనియర్ నాయకులు మీ సమస్యని మా దృష్టికి తీసుకు వస్తే ఎల్లారెడ్డి యంగ్ డైనమిక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్తామని, అలాగే ప్రభుత్వం దృష్టికి మా ఎమ్మెల్యే మదన్ మోహన్ తీసుకెళ్తారని మీడియా సమావేశంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు తెలిపారు.