Take a fresh look at your lifestyle.

వరిలో వెదజల్లే పద్ధతి మెలకువలు తెలుసుకోవాలి….

0 1,237

వరిలో వెదజల్లే పద్ధతి మెలకువలు తెలుసుకోవాలి

– ఏఈఓ రాకేష్

రామారెడ్డి, సెప్టెంబర్ 26 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో ఏఈఓ రాకేష్ పలు రకాల పంటలను పరిశీలించారు. అందులో భాగంగా వెదజల్లే విధానాన్ని రైతు సాగు చేస్తున్న కొట్టే వెంకటి పొలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ యొక్క రైతు వెదజల్లే విధానం ద్వారా పంటను పండిస్తున్నారు తద్వారా పెట్టుబడి ఖర్చులు ఎకరాకు 6 నుండి 7000 వేల వరకు ఆదా చేసుకోవచ్చని ఏఈఓ రాకేష్ తెలిపారు. వెదజల్లే విధానం ద్వారా వ్యవసాయం కూలీల కొరత అధిగమించవచ్చని, ముఖ్యంగా పంట ఏపుగా పెరిగి, నాటు వేసే విధానం కంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. రైతులు వ్యవసాయ పద్ధతులను అనుసరించి మెలకువలు నేర్చుకొని పంటలు దిగుబడిని పెంచుతూ, పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే విధంగా రైతులు మెలకువలు పాటించాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.