ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎక్కువ సభ్యులను చేర్పించాలి
కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : ఇండియన్ రెడ్ క్రాస్ లో సభ్యులుగా ఎక్కువ మొత్తంలో చేర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజు కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా మేనేజ్ మెంట్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రెడ్ క్రాస్ ద్వారా సామాజిక కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. అంతకుముందు గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజన్న, చీఫ్ ప్లానింగ్ అధికారి రాజారాం, జిల్లా సంక్షేమ అధికారి బావయ్య, రెడ్ క్రాస్ సొసైటీ నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.