కెమిస్ట్రీ అధ్యాపకునికి డాక్టరేట్… సన్మానం..!
ఎల్లారెడ్డి, నవంబర్ 12 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండలంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ కు రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ జగదీష్ ప్రసాద్ ఝాభార్మల్ తిబ్రేవాలా యూనివర్సిటీలో డాక్టరేట్ ప్రధానం చేసింది. ఆహార పదార్థాల నిల్వలో బయో టేబుల్ ప్లాస్టిక్ల వినియోగం అధ్యయనం అనే అంశంపై ఆయన నిర్వహించిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించినట్లు అరుణ్ కుమార్ తెలిపారు. సందర్భంగా మంగళవారం అరుణ్ కుమార్ కు ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణతో పాటు, అధ్యాపకులు శాలులతో సన్మానించి, అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.