బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, నవంబర్ 19 ( లోకంతీరు ) :ఎల్లారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగం రాజయ్య గారి తల్లి బాల కిష్టవ్వ సోమవారం మృతి చెందడంతో. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజుల సురేందర్ పార్టీ కార్యకర్తలతో కలిసి వారి కుటుంబానికి పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆదిమూలం సతీష్, ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఎరుకల సాయిలు, కళ్యాణి మాజీ సర్పంచ్ రఘువీర్ గౌడ్, సురేందర్ తదితరులు ఉన్నారు.