Take a fresh look at your lifestyle.

సింగరేణి అధికారుల ఉద్యమానికి సిక్కా సంఘీభావం

0 14

సింగరేణి అధికారుల ఉద్యమానికి సిక్కా సంఘీభావం.

పీఆర్పీతో పాటు న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)

గోదావరిఖని టౌన్, జూలై 2:సింగరేణి అధికారుల పీఆర్పీ బకాయిల చెల్లింపుతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఆర్జీ-1 ప్రాంత అధికారులకు సింగరేణి కాలరీస్ క్లరికల్ అసోసియేషన్ (సిక్కా) సభ్యులు గురువారం సంఘీభావం ప్రకటించారు.దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిక్కా నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం రోజుకు 12 నుంచి 14 గంటల పాటు శ్రమిస్తున్న అధికారులను తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. అధికారులకు రావాల్సిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్‌పీ) బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ-1 ప్రాంతానికి చెందిన మినిస్టీరియల్ స్టాఫ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారుల ఉద్యమానికి మద్దతు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.