కాటారం సబ్ డివిజన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కాటారం, ఆగస్టు 15:జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సబ్ డివిజన్ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించిన వేడుకల్లో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాటారం డీఎస్పీ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, వివిధ సంస్థలు, కార్మిక సంఘాల కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం తెలుపుకుంటూ వేడుకలను ఘనంగా నిర్వహించారు.