Take a fresh look at your lifestyle.

భూపాలపల్లి సీఐ చెన్నూరి శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

0 5

భూపాలపల్లి సీఐ చెన్నూరి శ్రీనివాస్‌కు ఘన సన్మానం.
సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభినందనలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 5: భూపాలపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా చెన్నూరి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. సంఘం ప్రతినిధులు సీఐ చెన్నూరి శ్రీనివాస్‌కు శాలువా కప్పి, పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.వి.రావు సంఘం నాయకులను సీఐ చెన్నూరి శ్రీనివాస్‌కు పరిచయం చేశారు. అనంతరం సింగరేణి సంస్థ పరిధిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం కోసం సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి, సామాజిక కార్యక్రమాల గురించి సీఐకి వివరించారు. ఇటీవల సింగరేణి ఆధ్వర్యంలో మహనీయుల జీవిత చరిత్ర, సామాజిక సేవలు, వారి ఆశయాలను ప్రతిబింబించే విధంగా నిర్వహించిన నాటకాల ప్రదర్శన గురించి కూడా సంఘం ప్రతినిధులు వివరించారు. మహనీయుల చరిత్రను నాటకాల రూపంలో ప్రజలకు, ఉద్యోగులకు చేరువ చేయడం ద్వారా వారి ఆశయాలు, సామాజిక సందేశాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తాయని తెలిపారు. అలాగే సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, ఉద్యోగ సంబంధిత సమస్యలపై అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను సీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు సామాజిక బాధ్యతతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంక్షేమం, సామాజిక చైతన్యం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ చెన్నూరి శ్రీనివాస్ సంఘం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. సమాజంలోని అన్ని వర్గాలతో సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎస్సీ లైజన్ ఆఫీసర్ ఆర్.చంద్రశేఖర్, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.వి.రావు, భూపాలపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ గడిపే చక్రపాణి, బ్రాంచ్ కార్యదర్శి మండల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ జనగాం రాయమల్లు, బ్రాంచ్ నాయకులు కొచ్చర్ల రవి, కేటీకే ఓసీ-2 ఫిట్ సెక్రెటరీ పోతుగంటి భద్రయ్య, కేటీకే-5 ఫిట్ సెక్రెటరీ రాంబాబు, కేఎల్‌పీ ఫిట్ సెక్రెటరీ ఎం.రమేష్, బోయిన రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.