
ఎంపీ రఘురాంరెడ్డికి కొత్వాల ఘనస్వాగతం.
ఏఏఐ బృందంతో సీతంపేటలో విమానాశ్రయ స్థల పరిశీలన.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పాల్వంచ, సెప్టెంబర్ 7: ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి కొత్తగూడెం పర్యటనకు వచ్చిన సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఘనస్వాగతం పలికారు. సోమవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్నతో కలిసి ఎంపీని శాలువాతో సత్కరించారు. అనంతరం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి సుజాతనగర్ మండలం సీతంపేటలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం నిర్వహించిన స్థల పరిశీలనలో ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి కొత్వాల పాల్గొన్నారు. విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన ప్రాంతం, భూమి పరిస్థితులు తదితర అంశాలను బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, అటవీ, ఏఏఐ శాఖల అధికారులు, రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కొండం వెంకన్న, బూసి శ్రీను, బొందిలి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.