Take a fresh look at your lifestyle.

టీయుడబ్ల్యుజే యూనియన్ డైరీ ఆవిష్కరణ….

0 1,777

టీయుడబ్ల్యుజే ఐజేయు డైరీ ఆవిష్కరణ

  • జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాము
  • జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ , ఫిబ్రవరి 13 ( లోకంతీరు ) : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యుజే) యూనియన్ డైరీని మంగళవారం నిజామాబాద్ కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. డైరీని ఆవిష్కరించిన కలెక్టర్ యూనియన్ పూర్వాపరాలు, ప్రస్తుత స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు అక్రిడిటేషన్ కార్డ్సు సమస్యతో పాటు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నిర్మాణం గురించి కలెక్టర్ తో ప్రస్తావించారు. దీంతో స్పందించిన కలెక్టర్ అర్ అండ్ బి అధికారులతో మాట్లాడారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి నిధులు కేటాయింపు, టెండర్ వివరాలను వెంటనే తెలపాలని, నిధులు మంజూరైతే, వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అక్రిడిటేషన్సు సమస్యను పరిష్కరిస్తామని, జూన్ లో రెన్యూవల్ కాకపోతే అదే నెలలో సమస్యలు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి. అరవింద్ బాలాజీ, నేషనల్ కౌన్సిల్ సభ్యులు గంగాదాస్, జిల్లా కోశాధికారి సిరిగాధ ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రమోద్ గౌడ్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి శేఖర్, నందాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.