డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న మహిళకు ఓ నెగిటివ్ ప్లేట్ లెట్స్ ను అందజేత
-
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

కామారెడ్డి జిల్లా , జూలై 22 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చిట్టి మల్లె సౌమ్య (28) డెంగ్యూ వ్యాధితో పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అత్యవసరంగా ప్లేట్ లెట్స్ అవసరమని డాక్టర్లు సూచించడంతో వారికి కావలసిన ప్లేట్ లెట్స్ ను కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్ నిజామాబాద్ వెళ్లి అందజేసారు. ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్లాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు కావాల్సిన ప్లేట్లెట్స్ దొరకగా పేషెంట్లు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందని, ప్లేట్ లెట్స్ ఇవ్వడం వలన ఎలాంటి బలహీనతలు రావడం జరగదని, దీనిపట్ల ఉన్న అపోహలను విడనాడాలని అన్నారు.
గత సంవత్సరం కూడా ఆపదలో ఉన్న వారికి కావలసిన ప్లేట్ లెట్స్ ను అందజేసారు. 56వ సారి రక్తదానానికి ముందుకొచ్చిన కిరణ్ కు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరఫున అభినందనలు తెలియజేశారు. కిరణ్ స్ఫూర్తిగా తీసుకొని రక్తదానానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు.