కల్తీ కల్లులో జలగలు, పీతలు ..?
– ఊర్లకు ఊర్లు ముంచెత్తుతున్న
కల్తీ కల్లు..?
– కల్తీ కళ్ళలో జలగలు, క్రిమి కీటకాలు..?
– జిల్లా కేంద్రంలో కూతవేటు దూరంలో ఎక్సైజ్ శాఖ..!
– లైసెన్స్ పేరుతో కల్తీ మాఫియా..?
– కళ్ళు దుకాణాలలో కల్తీ తో బాధితులు ఆగ్రహం..!
– ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది..?
– కల్తీని అరికట్టడంలో విఫలం…?
– కల్లు దుకాణాలను
ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ శాఖ.?
– జిల్లా వ్యాప్తంగా జోరుగా కల్తీ కల్లు దందా….?
– పర్యవేక్షణ కరువైన ఎక్సైజ్ శాఖ…!
– ఇంత జరిగింది పట్టించుకోని వైనం..?
కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 24 (లోకంతీరు) : పురాణాల్లో దేవతలు సైతం విశ్రాంతి కొరకు సురపానుకం అనే మత్తు రసాయాన్ని సేవించేవారు. అది పురాణాలలో గ్రంథాలలో ఉన్నట్టు చెబుతుంటారు. అది కాస్త రాను రాను ప్రజలలో కూడా కనువిప్పుగా మారింది మత్తు కోసం సహజ సిద్ధంగా దొరికే ఈత చెట్టు లేదా తాటి చెట్టు నుండి తీసిన కళ్ళు మాత్రమే సేవిస్తే ఆరోగ్యానికి బాగుంటుంది. ముఖ్యంగా కరోనా లాంటి కట్టడి చేసేందుకు,స్వయానా ప్రభుత్వమే స్వచ్ఛమైన కళ్ళు తాగితే నానా రకాల వ్యాధులు, దృఢమైన శక్తితో పాటు, ఆరోగ్యంగా పుష్టికారంగా క్యాన్సర్కు దూరంగా ఉంటామని ఆరోగ్యశాఖ చెప్పుకొచ్చిన మాట వాస్తవమే..? అయితే ఇదే అదునుగా చాలా కొంత కాలం నుండి కల్తీ మాఫియా ఒక ముఠాగా ఏర్పడి లైసెన్స్ పేరుతో స్వచ్ఛమైన కల్లును కల్తీ చేస్తున్నారు..!
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఎక్సైజ్ శాఖ..!
కామారెడ్డి కేంద్రంలో ఏరులై పాడుతున్న కల్తీకల్లు ఓవైపు ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికార యంత్రాంగం..? చాలా రోజుల నుండి కామారెడ్డి పట్టణంలో కు ఆనుకుని అడ్లూరు ఎల్లారెడ్డిలో జోరుగా సాగుతున్న కల్తీకల్లు లో జలగలు, ఈగల దోమలతో కూడిన, వ్యర్థ పదాలతో తయారైన రసాయన పదార్థంతో కళ్ళు సీసాలో నింపి అమ్ముతున్న వైనం.? ఇంత జరుగుతున్న పట్టింపు లేని ఎక్సైజ్ దాడులు, పర్యవేక్షణ కరువై యథేచ్ఛగా యజమానులు విచ్చలవిడిగా కల్తీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పవచ్చు అదేవిధంగా శాఖకు సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోని వైనం. ఇట్టి కల్తీ మాఫియా వెనక ఎవరు హస్తం ఉంది అనే అనుమానం లేకపోలేదు.?
అధికారులు సరిగ్గా పనిచేసి ఉంటే…?
బాధ్యతాయుతంగా సిబ్బంది,వారి పని వారు చేయడం వలన ఇలాంటి ఘటనలు జరిగేవి కావు ముఖ్య కారణం అధికారుల లోపమే అని పలువురు మందు బాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బులతో మేము ప్రభుత్వ దుకాణాల లో కొనుగోలు చేసే కల్లు పైన కల్తీ మాఫియా బాదుడు ఎంతవరకు సమంజసం అని వాపోతున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా…!
ఇంత జరిగినా కళ్ళు దుకాణం ఇంకా నడుస్తూనే ఉన్నారు. ఎవరి అండ దండలు ఉన్నాయని, స్థానికులు ఆపోతున్నారు. ఇలాంటి కన్నులు సేవించడం వల్ల ప్రాణాలకు ఆపాయం ఉంటుందని తెలిసి కూడా కొనసాగిస్తున్నారు.ఈ మాఫియా ను ఎండగట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా షాపులు ఎలా ఉండాలి, వాటి నిబంధనలు ఏంటి, సమయపాలన, ఏ వయసు వారికి ఇవ్వాలి, అనే పరిజ్ఞానం లేని యాజమాన్యాలు, గుమస్తా లతో కల్లును విక్రయిస్తున్నారు. ఇట్టి విషయంపై ప్రభుత్వం చర్య తీసుకొని తగు సూచనలతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన.
లైసెన్స్ కొందరికి ప్రాతినిధ్యం అందరికా…?
స్వచ్ఛమైన కళ్ళు గీసే గీత కార్మికులు కొందరైతే వారిని అడ్డుపెట్టుకొని చలామణి చేస్తున్న కల్తీ మాఫియా ఓ రకంగా చెప్పాలంటే వీళ్లు నరమాంస భక్షకులుగా చలామనవుతున్నారని సమాచారం..? డబ్బుల కోసం ఇంత కక్కుర్తి. ఇంతకైనా తెగిస్తారా..?
గీత కార్మికులు గీసిన కల్లు ను ముస్తేదారుల ముసుగులో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సరిపోయి కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న కన్నెత్తి చూడని ఎక్సైజ్ శాఖ పనితీరు..?
కల్తీ వల్ల లాభమేంటి…?
కల్తీ మందు వలన ప్రభుత్వానికి పన్ను ఎగవేత అదేవిధంగా తక్కువ ధర కి సప్లై..! అంతేకాక ఎక్కువ ధర తో విక్రయిస్తున్న సెలిక్ ఫీవర్ ల పేరుతో కల్తీ చేయడం వలన లాభాలు దండుకుంటున్న, యజమానులు, ముఖ్యంగా నిర్దిష్ట వయస్సు మించి చిన్న పిల్లలకు సైతం కల్లు విక్రయిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేగాక ప్రభుత్వ కల్లు దుకాణం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలో సిబ్బందికి తెలీదా..?
గ్రామీణ ప్రాంతాలలో కల్లు అనగానే …. ?
ముందుగా మందుబాబులకు, కళ్ళు బాబులకు గుర్తొచ్చేది గ్రామీణ ప్రాంతాలలో అలవాటు పడిన ప్రజలు,కల్తీ కల్లు తయారుచేసి ఏరులై పారిస్తున్నారు. దండిగాని సొమ్ము చేసుకుంటూ.. లైసెన్స్ ఉంది సంఘానికి అనే ధీమాలో కల్లు యజమానులు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అక్కడక్కడ ఉదాహరణకు ఉన్న కల్లు దుకాణాలలో గత కొన్ని రోజులుగా కల్తీ అమ్ముతున్నట్లు వదంతులు వ్యాపించాయి. దీనికి తోడు మందు బాబులు ఇక్కడ బాగాలేవనీ, తప్పు ఎక్కడ జరుగుతున్నా మేం మాత్రం నష్టపోతున్నారని వారు ఆరోపించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
బార్లను తలపించేలా కల్లు దుకాణాలు షాపులు..?
ఇదిలా ఉంటే కామారెడ్డి జిల్లాకు అతి సమీపంలో కలెక్టరేట్ భవనానికి కూత వేటు దూరంలో వడ్లూరు ఎల్లారెడ్డిలో బార్లను తలపించేలా కల్లు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వ షాపు మెయిన్ రోడ్డుకు అనుకొని ఉన్నందువలన రాత్రి అయితే చాలు వాహనదారులకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రోడ్లలో మూలమలుపుకు అతి సమీపంగా ఉండడం పట్ల జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దుకణం అంతా కల్తీ మాఫియా..!
ఉన్న కేంద్రాలలో పేరుకే ప్రభుత్వ దుకాణం అమ్మేదంతా విచ్చలవిడిగా కల్తీ కళ్ళు దీనికి తోడు అధిక ధరలు లబోదిబో ఇవ్వమంటున్న కల్లు బాబులు, పట్టించుకునేవారు కరువై పర్యవేక్షణ లేక ఇలా మారుతున్నాయి. ఇలాంటి ప్రదేశాలలో కల్లు షాపు ఉండడంవల్ల వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కో గ్రామంలో పదుల స్థానంలో షాపులను కొనసాగిస్తున్నారు.
ఆదాయమే ప్రభుత్వ లక్ష్యంగానా..?
విచ్చలవిడిగా జోరుగా కల్లు అమ్మడం వలన ప్రజలు యువత పెడదారి పడుతున్నారు. అని చింతన లేకుండానే కల్తీ కల్లు ఇష్ట మొచ్చినట్టు ఇష్టం వచ్చిన సమయంలో షాపులకు అడిగినంతగా కల్తీ ముస్తే దారుల ముసుగులో సప్లై చేస్తున్న పట్టించుకోని మొండి వైఖరి..? ఇకనైనా అధికార యంత్రాంగం పర్యవేక్షణతో కట్టుదిట్టంగా కల్తీ కి చర్య చరమగీతం పాడాల్సింది. సజావుగా అమ్మే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని మేధావి వర్గం భావిస్తుంది.
