భూపాలపల్లి 26వ వార్డు బీఆర్ఎస్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
అధ్యక్షుడిగా బాసనపల్లి కుమార్, ప్రధాన కార్యదర్శిగా పిట్టల చందు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, నవంబర్ 15:భూపాలపల్లి పట్టణంలోని 26వ వార్డు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి, పీఏసీఎస్ చైర్‌పర్సన్ మేకల సంపత్ కుమార్, నాయకులు సెగ్గం సిద్దు, రాయమల్లు, వార్డు ఇన్‌చార్జి పాటకుల రమాదేవి భాను తదితరుల సమక్షంలో ఆదివారం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నూతన కమిటీ అధ్యక్షుడిగా బాసనపల్లి కుమార్, గౌరవ అధ్యక్షుడిగా పిడుగు రవి, ఉపాధ్యక్షుడిగా చీలివేరు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా పిట్టల చందు, సహాయ కార్యదర్శిగా పుట్టపాక అశోక్, కోశాధికారిగా దర్బార్ అవినాష్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా ఆలూరు సత్తయ్య, బండం శ్యాంసుందరరెడ్డి, ఎస్. శ్రీనాథ్, కె. భరత్, జి. వినయ్ కుమార్, నల్ల వంశీ, గరిమళ్ళ సమ్మయ్య, సిద్ధ కుమారస్వామి, ముకేశ్ కుమార్, పర్స రవితేజలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బాసనపల్లి కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, రాబోయే ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సమష్టిగా పనిచేస్తామని తెలిపారు. పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వార్డులో పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.