Take a fresh look at your lifestyle.

శోదా కంపెనీలో కార్మిక చట్టాలు అమలు చేయాలి : ఐఎఫ్‌టీయూ.

0 2

శోదా కంపెనీలో కార్మిక చట్టాలు అమలు చేయాలి.
కార్మికుల పోరాటానికి ఐఎఫ్‌టీయూ మద్దతు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, నవంబర్ 16:సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వీకేసీఎం ఓపెన్‌కాస్ట్‌ శోదా కంపెనీలో కార్మిక చట్టాలను అమలు చేయాలని, హక్కుల కోసం వారం రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే. సీతారామయ్య ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సోమవారం ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఐఎఫ్‌టీయూ ప్రతినిధి బృందం కార్మికులకు మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం 26 శాతం అదనపు లాభాలతో శోదా కంపెనీకి టెండర్ ఎలా కేటాయించిందని, ఆ సంస్థలో కనీస వేతనాలు, చట్టబద్ధ హక్కులు ఎందుకు అమలు చేయించడం లేదని ప్రశ్నించారు. మస్టరుకు రూ.65 బోనస్‌గా నిర్ణయించడం, కార్మికుల పనిదినాలతో సంబంధం లేకుండా బోనస్ చెల్లించడం సరైన విధానం కాదన్నారు. కార్మికుల డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించాలని, బెదిరింపులు, ఉద్యోగాల తొలగింపులు సమస్యను మరింత జటిలం చేస్తాయని హెచ్చరించారు. గతంలో కొత్తగూడెం ఓపెన్‌కాస్ట్ కార్మికులు 35 రోజుల సమ్మె నిర్వహించి, అక్రమ కేసులు, బెదిరింపులను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కనీస వేతనాలు, ఎనిమిది గంటల పని, డబుల్ మస్టర్, సెలవులు తదితర చట్టబద్ధ సౌకర్యాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం, కేంద్ర కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకుని కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్ధ హక్కులు కల్పించాలని కోరారు. కాంట్రాక్టర్ స్పందించకపోతే ప్రిన్సిపల్ ఎంప్లాయర్‌గా సింగరేణి యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని, అవసరమైతే టెండర్ రద్దు చేయాలని సూచించారు. ధర్నా శిబిరానికి బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు యాకయ్య, రాంపురం సర్పంచ్ బదావత్ కళావతి, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, అంబేద్కర్ నగర్ సర్పంచ్ బదావత్ జ్యోతి, విశ్వనాథం, ముత్యాలు, కట్ట నరసింహారావు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కలకోటి ఐలయ్య మద్దతు తెలిపారు. జేఏసీ నాయకులు మార్షల్ శీను, బి. మోహన్, జయ మోహన్, బి. సతీష్, ఎన్. సంజీవ్, జి. వెంకన్న, ఎస్. అశోక్, అల్లి నాగయ్య, ప్రమోద్, రఘు, పి.ఎల్. సురేష్, బాచి, కోటి, హైమద్, పాషా, బాజీ, జలీల్, రవి గౌడ్, కోటేశ్వరరావు, చంద్రశేఖర్, రమేష్, రవి, టి. రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.