ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

రామారెడ్డి , ఏప్రిల్ 20 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో, శనివారం అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించారు.ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరింత వేగవంతం చేయవలసినదిగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. సదాశివనగర్,రామారెడ్డి మండలం కేంద్రం, ఉప్పల్ వాయి గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశిలించి ధాన్యం సేకరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ టోకెన్లు కేటాయించిన వారీగా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఎఫ్.ఏ. క్యూ ప్రమాణాలకనుగుణంగా 17 శాతం తేమ మించకుండా, తాళ్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు పొందవలసినదిగా సూచించారు. గన్ని సంచుల కొరత లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ సీఈవో కడెం బైరయ్య, ఏఈఓ రాకేష్ కుమార్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తహసీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.