Take a fresh look at your lifestyle.

పోస్టల్ స్కీములపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం….

0 1,212

వేంపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో పోస్టల్ స్కీములపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , ఆగస్టు 06 ( లోకంతీరు)  : ముప్కాల్ మండల పరిధిలోని వేంపల్లి గ్రామపంచాయతీలో గ్రామస్తులతో తపాలా శాఖ ఏఎస్పీ శ్రవణ్ కుమార్, పాఠశాల హెచ్ఎం శైవ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి రాజ్యలక్ష్మి, మెయిల్ వోవారీస్ దశరథ్ బీపీఎంల ఆధ్వర్యంలో మంగళవారం పోస్టల్ స్కీములపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ ఏఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ గ్రామంలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లలో మీ కుటుంబంలో ప్రతీ ఒక్కరికి ఉపయోగపడే పోస్టల్ స్కీములు ఉంటాయని, వివరాలలోకి వెళ్తే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ 10 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కేవలం 500 రూపాయలతో ఖాతా ప్రారంభించవచ్చన్నారు. ఏటీఎం,చెక్ బుక్, ఆర్టీజిఎస్, నెఫ్ట్ ఈ పాస్బుక్ సౌకర్యం కలదని,ఉచిత ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా కలదని అన్నారు.
రికరింగ్ డిపాజిట్లు, ఒక చిన్న పొదుపు, పెద్ద రాబడి కి దారి తీస్తుందని,పోస్ట్ ఆఫీస్ లో ప్రతినెల ఆర్ డి లో జమ చేయండి కేవలం 5 సంవత్సరాలలో పెద్ద మొత్తంలో నగదు పొందండి అన్నారు. సుకన్య సమృద్ధి యోజన 10 సంవత్సరాల లోపు ఆడపిల్లల పెద్ద చదువుల కోసం మరియు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పెళ్లి చేయడం కోసం ఎస్ఎస్ఏ అకౌంట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. తపాలా జీవిత బీమా పొదుపుతో పాటు జీవిత బీమా అందిస్తున్న పోస్టల్ శాఖ దేశంలో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కన్నా తక్కువ ప్రీమియంతో అధిక బోనస్ అందిస్తుందన్నారు.గ్రామీణ తపాలా జీవిత బీమా గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకమని,అటు పొదుపుతో పాటు జీవిత బీమాను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న పథకం అన్నారు.
ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కేవలం సంవత్సరానికి 426/- రూపాయలకే 2 లక్షల జీవిత బీమా చేయవచ్చని దీనిని 18-50 సంవత్సరాల వయస్సు గల వారే అర్హులన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కేవలం సంవత్సరానికి ₹20/-కే 2 లక్షల ప్రమాద బీమా చేయబడుతుందని దీనికి 18-70 సంవత్సరాల వయసు గలవారు అర్హులు అన్నారు. గ్రూప్ ఆక్సిడెంట్ గార్డ్ పాలసీ కేవలం 400/- లోపు ప్రీమియంతో 10 లక్షల గ్రూప్ ఆక్సిడెంట్ గాడ్ పాలసీ కలదు. ప్రమాదం జరిగినప్పుడు 60 వేల వరకు ఇన్ పేషెంట్ ఖర్చులకు 30 వేల వరకు అవుట్ పేషెంట్ ఖర్చులకు ఇవ్వబడుతుందన్నారు.
సంవత్సరానికి 50 లక్షల ప్రమాద బీమా సౌకర్యానికి కేవలం 2850/- తో ప్రీమియం రోజుకు 8/- రూపాయలు మాత్రమే మీ రోజువారి టీ కంటే తక్కువ ఖర్చుతో గ్రూప్ ఆక్సిడెంట్ గాడ్ పాలసీ చేయండన్నారు.దీనివల్ల ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా, శాశ్వత పాక్షిక అంగవైకల్యం పొందిన వారికి 50 లక్షలు పొందవచ్చని అలాగే కిసాన్ వికాస పత్రాలు, ఇందిరా వికాస పత్రాలతో డబ్బులు దాచుకోవచ్చని, పెన్షనర్స్ కు లైఫ్ సర్టిఫికెట్స్ పోస్ట్ ఆఫీస్ లోనే ఇస్తారన్నారు.బ్యాంకు మాదిరిగా గ్రామంలో మీ ఇంటి దగ్గర నుండి లావాదేవీలు జరుపుకోవచ్చు అన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులకు పోస్టల్ స్కీమ్ లపై అవగాహన కలిగించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శైవ శ్రీనివాస్,గ్రామ సెక్రెటరీ రాజ్యలక్ష్మి, బీపీఎం అలేఖ్య ఉపన్యసించారు.
ఈ కార్యక్రమంలో మెయిల్ వోవారీస్ దశరథ్, సమన్వయకర్తగా జింధం నరహరి వ్యవహరించారు.స్థానిక గ్రామ బీపీఎం సరికెల సాగర్,సుష్మ, భవాని, గంగ ముత్యం, యేశాల శ్రీనివాస్, సూరజ్, గంగా కిషన్, సతీష్,గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు,మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.