మానవ హక్కుల కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ గా దేశ్ పాండే

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,ఆగస్టు 14 ( లోకంతీరు ) :
హైదరాబాద్ లో జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ గా వేల్పూర్ మండల పోచంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దేశ్ పాండే అనంతరావు నియామకులయ్యారు. జస్టిస్ చందు కుమార్ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ అలాగే నేషనల్ సెక్రటరీ మామిడాల మనోహర్ వారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. దేశ్ పాండే అనంతరావు చేసిన సోషల్ ఆక్టివిటీస్ లో సేవా దృక్పథంలో భాగంగా నేషనల్ అచీవ్మెంట్ జస్టిస్ చందు కుమార్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. దేశ్ పాండే అనంతరావు మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి రాష్ట్ర చైర్మన్గా నియమించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. వారు ఇచ్చిన గురుతర బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని తెలియజేస్తున్నాను అని అన్నారు.