Take a fresh look at your lifestyle.

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం ….

0 1,323

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం 

– ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలి

– సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూర్మ సాయిబాబా 

ఎల్లారెడ్డి, అక్టోబర్ 10 ( లోకంతీరు ) : నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ సేవలందించాలని ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయి బాబా అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో బుధవారం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న ఎల్లారెడ్డి మండల నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఘనంగా శాలువులతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు విజ్ఞానాన్ని ప్రసాదించి విద్యార్థుల తలరాతను తీర్చిదిద్దాలన్నారు. దేశ భవిష్యత్తు సమాజ నిర్మాణం ఉపాధ్యాయుల చేతులనే ఉంటుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యకు ఎంతో ప్రాధాన్యతమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతారని నమ్మకం ఉందన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పి ఉత్తమమైన వ్యక్తులు తీర్చిదిద్దుతూ సమాజానికి అందించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ నాగం గోపికృష్ణ, కౌన్సిలర్లు మహేశ్వరి విద్యాసాగర్, పోచయ్య, నీలకంఠం, మాజీ వైస్ ఎంపీపీ నునుగొండ శ్రీనివాస్, గాదె తిరుపతి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.