Take a fresh look at your lifestyle.

జోనల్ స్థాయి కబడ్డీ పోటీకి ఎంపికైన విద్యార్థి…..

0 1,287

జోనల్ స్థాయి కబడ్డీ పోటీకి ఎంపికైన విద్యార్థి

ముధోల్, నవంబర్ 04 ( లోకంతీరు ) : మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన వినయ్ అనే విద్యార్థి జిల్లా కేంద్రంలో ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్- 17 బాలుర కబడ్డీ పోటీల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. విద్యార్థి జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అదిలాబాదులో జరిగే జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు. జోనల్ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థికి ప్రధానోపాధ్యాయులు, పిడి శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.