సింగరేణిలో ఇద్దరు ఏజీఎంలకు జీఎంలుగా హోదా మార్పు.
సెప్టెంబర్ 1 నుంచి ఉత్తర్వులు అమలు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, సెప్టెంబర్ 6: సింగరేణి E&M విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు అదనపు జనరల్ మేనేజర్ల (E&M) హోదాను జనరల్ మేనేజర్లు (E&M)గా మార్పు చేస్తూ సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఎం (పర్సనల్) EE & RC సెప్టెంబర్ 5, 2026న ఈ కార్యాలయ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మార్పులు 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఉత్తర్వుల ప్రకారం.. కార్పొరేట్‌లోని పునరుత్పాదక ఇంధన విభాగంలో అదనపు జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఎస్. శ్రీనివాస్ జనరల్ మేనేజర్ (E&M)గా నామకరణం చేశారు. ఆయన డైరెక్టర్ (E&M)కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కార్పొరేట్ విజిలెన్స్ విభాగంలో అదనపు జనరల్ మేనేజర్(E&M) గా పనిచేస్తున్న ఎస్.వి. మురళీధర్ రాజు జనరల్ మేనేజర్ (E&M)గా హోదా మార్చారు. ఆయన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే హోదా మార్పు కారణంగా ఇరువురి వేతనం, పే, గ్రేడ్లలో ఎలాంటి మార్పు ఉండదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.