బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్
-
ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 23 ( లోకంతీరు ) : ఉమ్మడి కోటగిరి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది.కోటగిరి, పోతంగల్ మండలాలకు చెందిన కీలక నేతలు,ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి కోటగిరి మండల ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ బర్ల గంగారం, ఎంపీటీసీలు అనంత విఠల్,కేశ వీరేశం,సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్, కోటగిరి,పోతంగల్ మండలం లోని ఆయా గ్రామాలకు చెందిన 500 మంది బీఅర్ఎస్ నేతలు ప్రజాప్రతినిధులు పెద్ద మొత్తం లో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తామని నూతనంగా చేరిన వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.పది సం.లు బీఅర్ఎస్ పార్టీలో ఉండి పోచారం కుటుంబ సభ్యుల పాలనకు విసుగు చెంది కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఉమ్మడి కోటగిరి మండల ప్రజా ప్రతినిధులకు,ముఖ్య నాయకులకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ లక్ష్యాన్ని ముద్దాడలేక పోయామన్నారు.పోచారం శ్రీనివాస్ రెడ్డి వారి కుమారుల నిరంకుశ పాలనను మీ అందరి సహకారంతో ఎదిరిస్తానని తెలిపారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపి ఇక్కడ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వం కూలి పోతుందని రెండు నాలుకల దోరణితో మాట్లాడటం సిగ్గుచేటన్నారు.ఇటీవలే పోచారం గ్రామంలో బీఅర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరి బిల్లులను ఇప్పిస్తానని కళ్ళబుల్లి మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రతి హామీని కచ్చితంగా అమలు చేస్తోందని.అవినీతి, అక్రమాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీగా పని చేస్తుందని తెలిపారు.ఈ చేరిక ల సందర్భంగా పాత,కొత్త వారని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.పాత కార్యకర్తలకు తగిన న్యాయం చేస్తూ,కొత్తవారిలో యోగ్యుల యొక్క సేవలను వినియోగిం చుకొంటామన్నారు.రైతులకు నీరు సరఫర కాక అనేక ఇబ్బం దులకు గురైన సంఘటనలు చూసి చలించి కాలువల పూడి కలు తీస్తే కార్యక్రమం చేస్తే పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షం లో ఆయన కుమారులు సంస్కార రహిత మాటలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నిక లలో ఏఏ గ్రామలు మంచి మెజారిటీని ఇస్తయో ఆయా గ్రామాలను సీఎం రేవంత్ రెడ్డి నిండి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ చేరికల కార్యక్రమంలో కోటగిరి,పోతంగల్ మండలా లకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుస్సేన్, పుప్పాల శంకర్,బ్లాక్ కాంగ్రెస్ ప్రసిడెంట్ చంద్రశేఖర్,రాష్ట్ర మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు యలమంచలి శ్రీనివాస్,కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ డా.సునీల్ కుమార్, డీసీసీ డెలిగేట్ సభ్యులు కొట్టం మనోహర్,వహీద్,మాజీ జెడ్పీటీసీ శివరాజ్ దేశాయ్, మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్,నియోజకవర్గ,మండల నాయకులు ప్రతాప్ సింగ్, గంధపు పవన్,మధుసూధన్, ఆయుబ్,సీనియర్ నాయకు లు,కార్యకర్తలు పాల్గొన్నారు.