Take a fresh look at your lifestyle.

నా భర్త మృతదేహాన్ని బెహరన్ నుండి తెప్పించండి…..

0 1,412

ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవచూపి నా భర్త మృతదేహాన్ని బెహరన్ నుండి తెప్పించండి

  • స్వగ్రామానికి తెప్పించి తమ కుటుంబాన్ని ఆదుకోండి

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై  20 ( లోకంతీరు ) : మెండోరా మండల కేంద్రానికి చెందిన మాకూరి వినోద్ 35 సంవత్సరాలు బెహరన్ లో తన భర్త విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడని భార్య యమున రోధిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని బెహరన్ లో మృతి చెందిన తన భర్త శవాన్ని స్వ గ్రామానికి గ్రామానికి తెప్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని భార్య యమున రోదిస్తూ సీ.ఎం.ను పత్రిక ముఖంగావేడుకుంది. తమది అతి నిరుపేద కుటుంబమని, తమకు ఒక చిన్న కుమారుడు, ఒక కుమార్తె, కలిగి ఉన్నారని, తన భర్త మాకు వినోద్ పొట్ట చేత పట్టుకుని కుటుంబ పోషణ కోసం బెహరన్ దేశానికి వెళ్ళాడని భార్య ఎన్న రోధిస్తూ ముఖ్యమంత్రిని వేడుకుంటుంది. గత రెండు రోజుల క్రితం మంగళవారం రోజున తన భర్త విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు చనిపోయాడని, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ,ప్రత్యేక చొరవ తీసుకుని తమ భర్త శవాన్ని స్వగ్రామానికి తెప్పించి, తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని మృతుని భార్య మాకూరి యమునా పత్రిక ముఖంగా సీఎంకు మొరపెట్టుకుంది. తమ కుటుంబానికి అన్ని విధాలుగా ఆర్థిక సాయం అందించాలని సీ.ఎం. రేవంత్ రెడ్డికి పత్రిక ముఖంగా రోదిస్తూ వేడుకుంది.

Leave A Reply

Your email address will not be published.