Take a fresh look at your lifestyle.

ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమ్మె….

0 1,268

11 రోజులుగా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమ్మె

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 31 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆరోగ్య శ్రీ ఉద్యోగులు 11 వ రోజున నల్ల బ్యాడ్జీలు ధరించి కామారెడ్డి ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ మిత్రాలు హాస్పిటల్ ఎదుట నిరసన కార్యక్రమం చేసారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అల్లావుద్దీన్ మాట్లాడుతూ సమ్మె నోటీస్ ఇచ్చి 20 రోజులు గడిచిపోయినప్పటికీ నేటి వరకు సమస్య పరిష్కారం చేయకుండా అధికారులు కాలయాపన చేస్తూ.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో సెప్టెంబర్ సోమవారం 2 వ తేదీ నుండి విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, తక్షణమే న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించి ప్రభుత్వం ఉదారతను చాటుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వివిధ హాస్పిటల్ లో 25 మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్రాలు గంగాధర్, అంజయ్య, మహేష్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.