Take a fresh look at your lifestyle.

రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు….

0 1,434

రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు

ఎల్లారెడ్డి, నవంబర్ 03 ( లోకంతీరు ) : దళారి వ్యవస్థను పూర్తిగా రూపుమాపడం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నదని ఎల్లారెడ్డి మండలంలోని వెలుట్ల సొసైటీ చైర్మన్ పటేల్ సాయిలు అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల, తిమ్మారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తోపాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా, సొసైటీ డైరెక్టర్లతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ వెల్లుట్ల సొసైటీ చైర్మన్ పటేల్ సాయులు శాలువులతో సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రైతులు పండించిన పంటలను దళారులకు విక్రయించి పూర్తిగా నష్టపోతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకోవాలని తెలిపారు. కల్లాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం ఏ రకం ధాన్యం రూ.2320, బి రకం ధాన్యానికి 2300ల ధర అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పటేల్ సాయిలు, డైరెక్టర్ గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు సంతోష్ నాయక్,తిమ్మరెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి , కిష్టా రెడ్డి, గంగారెడ్డి, తిమ్మరెడ్డి గ్రామ మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

సాతేల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మండల మండలంలోని సాతెల్లి గ్రామంలో ఎల్లారెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘం అధ్యక్షుడు ఎగుల నర్సింలు, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా సొసైటీ డైరెక్టర్లతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ-గ్రేడ్‌ ధాన్యం ధర రూ.2320, బీ -గ్రేడ్‌ రూ.2300చొప్పున ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామాల్లో దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు నాగం గోపి కృష్ణ, నాయకులు విద్యాసాగర్, మాజీ వైస్ ఎంపీపీ నునుగొండ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.