గొల్లబజార్‌లో ఘనంగా స్వామివారి పల్లకి సేవ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, సెప్టెంబర్ 21: ఖమ్మం నగరంలోని 42వ డివిజన్ గొల్లబజార్‌లో శ్రీ స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం ఇంటెలిజెన్స్ ఎస్పీ రామోజీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి పల్లకిని మోశారు. తోడేటి లింగరాజు యాదవ్, కనకదుర్గ, తోడేటి చంద్రమౌళి చైతన్య ఆధ్వర్యంలో సంఘమిత్ర యూత్ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీబీ చైర్మన్ కూరగాయల నాగభూషణం, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు కూరాకుల వలరాజు, దొంగల తిరుపతిరావు, తొట్టి కొమరయ్య, వెంకటరమణ, బుడిగం సురేష్‌కుమార్, రామిశెట్టి శ్రీనివాస్, సీహెచ్ రాము తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అల్పాహారం, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన దిలీప్ అయ్యగారిని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. స్వామివారి ఆశీస్సులతో డివిజన్ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. పల్లకి సేవను విజయవంతంగా నిర్వహించిన సంఘమిత్ర యూత్ కమిటీ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.
