Take a fresh look at your lifestyle.

కార్మికులకు లాభాల్లో వాటా 40 శాతం చెల్లించాలి : ఏఐటీయూసీ నాయకులు.

0 4

కార్మికులకు లాభాల్లో వాటా 40 శాతం చెల్లించాలి.
రూ.59 వేల కోట్ల బకాయిలను కంపెనీకి తక్షణమే చెల్లించాలి.
జిడికే.1 గని మేనేజర్ కు వినతి పత్రమిచ్చిన ఏఐటీయూసీ నాయకులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, అక్టోబర్ 5:సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 40 శాతం వాటా చెల్లించాలని, సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే-1 ఇంక్లైన్‌ గని మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి పెంపునకు కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన లాభాల్లో 40 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని ఆయన కోరారు. ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రాంచి ఉపాధ్యక్షులు సంకె అశోక్, పిట్ సెక్రటరీ మానాల శ్రీనివాస్, నాయకులు ఉప్పులేటి తిరుపతి, కొప్పుల లింగయ్య, నేరెల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.