Take a fresh look at your lifestyle.

బీడీ కార్మికుల సమ్మె నోటీసు అందజేత….

0 1,286

బీడీ కార్మికుల సమ్మె నోటీసు అందజేత.

  • బీడీ కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా 4000/- జీవన భృతి ఇవ్వాలి.
  • కార్మిక వ్యతిరేక 4 కోడ్ లను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.

నిజామాబాదు, జనవరి 31( లోకం తీరు ) : తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (IFTU) ఆధ్వర్యంలో బీడీ యాజమాన్య సంఘం అధ్యక్ష కార్యదర్శులకు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగశీల బీడీ వర్కర్స్ (IFTU) యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బీడీ కార్మికులు కూడా పాల్గొంటారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమపై కుట్రలు పండుతుందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక 4 కోడ్ లను మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. కనీస వేతనాల చట్టం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతనాలను సవరించాలన్నారు. కానీ నేటికి 12 సంవత్సరాలు గడిచిపోతున్న గత రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరించలేదన్నారు. తద్వారా బీడీ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వేతన సవరణ చేయాలన్నారు. బీడీ కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా 4000/- జీవన భృతి ఇవ్వాలన్నారు.

ఫిబ్రవరి 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకన్న  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.