Take a fresh look at your lifestyle.

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా కొరిమి రాజ్‌కుమార్.

0 2

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా కొరిమి రాజ్‌కుమార్.
రాష్ట్ర కమిటీలో భూపాలపల్లికి పెద్దపీట.
కౌన్సిల్ సభ్యులుగా కుడుదుల వెంకటేష్, మోటపలుకుల రమేష్, క్యాథరాజు సతీష్, కొరిమి సుగుణ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 9: కరీంనగర్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో జయశంకర్-భూపాలపల్లి జిల్లాకు చెందిన సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ను ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా కుడుదుల వెంకటేష్, మోటపలుకుల రమేష్, క్యాథరాజు సతీష్, కొరిమి సుగుణలకు అవకాశం లభించింది. దీంతో ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీలో జయశంకర్-భూపాలపల్లి జిల్లాకు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యత దక్కిందని పార్టీ, కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. భూపాలపల్లి పారిశ్రామిక ప్రాంతంలో వివిధ రంగాల్లో కార్మికుల సమస్యలపై పనిచేస్తున్న ఏఐటీయూసీ నాయకులకు రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం లభించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా నుంచి ఒకరికి రాష్ట్ర కార్యదర్శి పదవితో పాటు నలుగురికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా అవకాశం దక్కడం ఏఐటీయూసీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో లభించిన ఈ ప్రాతినిధ్యంతో భూపాలపల్లి జిల్లాలో కార్మిక సంఘాన్ని మరింత బలోపేతం చేసి, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను విస్తృతం చేయాలని కార్యకర్తలు ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.