రామారెడ్డి మండల ఎంపీపీ కి హైకోర్టు స్టే ఊరట..!
– ఎంపీపీ దశరథ్ రెడ్డి అవిశ్వాసం పై హైకోర్టు స్టే

కామారెడ్డి జిల్లా రామారెడ్డి , ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి పై ఈనెల 9న ఏడుగురు ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాస తీర్మానం పై హైకోర్టు స్టే విధించినట్టు ఎంపీపీ దశరథ్ రెడ్డి తెలిపారు. హైకోర్టు విధించిన స్టే కాపీని మంగళవారం కామారెడ్డి ఆర్డిఓ వై రంగనాథ్ కు స్టే కాపీని అందజేశారు. ఈనెల 9న ఎంపీపీ పై అవిశ్వాసం తీర్మానం పై ఏడుగురు ఎంపీటీసీలు సంతకాలు చేసి కామారెడ్డి ఆర్డీవోకు అందజేశారు. ఆర్డీవో మార్చి ఆరో తేదీ న అవిశ్వాసం పై సమావేశం నిర్వహిస్తూ ఆర్డీవో నోటీసులు అందజేశారు. ఈ నోటిసు పై స్పందిస్తూ ఎంపీపీ దశరథ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిశీలించిన కోర్టు స్టే విధించింది.స్టే వలన ఊరట కలిగింది. దీంతో ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ నాయకులు దశరథ్ రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.